Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వారావుపేట
బాలికలకు సుకన్య సమృద్ధి యోజన పథకం వరం లాంటిదని ఉమ్మడి ఖమ్మం జిల్లా తపాలా శాఖ సూపరింటిండెంటు బి.రవి కుమార్ అన్నారు. మండలంలోని మల్లాయిగూడెం, రామన్నగూడెం, కన్నాయిగూడెం, కావడిగుండ్ల, ముద్దులమడ, పాతరెడ్డిగూడెం గ్రామాల్లో నూతన తపాలా కార్యాలయాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లాయిగూడెంలో సర్పంచ్ నారం రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ సభకు రవికుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో 212 గ్రామీణ తపాలా కార్యాలయాలు మంజూరయ్యాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎసీఐపీ ప్రవీణ్ కుమార్, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, జెడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి, సర్పంచులు మాడి స్వప్న, గొంది లక్ష్మణరావు, కంగాల భూలక్ష్మి, రాములమ్మ, మెయిల్ ఓవర్సీర్ వెంకటేశ్వరరావు, రవికుమార్, ఎస్పీ ఎం.మహేందర్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.