Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు విశ్వనాథ్
నవతెలంగాణ-ఇల్లందు
నరేంద్రమోడీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనాలను కాపాడుతూ దేశసంపదలను, వనరులను, పరిశ్రమలను కారుచౌకగా అమ్మి వేస్తున్నదని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 29, 30 దేశవ్యాప్తంగా కార్మికవర్గం తలపెట్టిన సార్వత్రిక సమ్మెలో సింగరేణి కార్మికవర్గం పాల్గొని విజయవంతం చేయాలని ఐఎఫ్టియూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.విశ్వనాథ్ అన్నారు. కార్యాలయంలో శనివారం జరిగిన ఏరియా కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సమావేశానికి ఏరియా కార్యదర్శి రవి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ మాట్లాడుతూ కార్మికహక్కులను కార్పొరేట్ సంస్థల ముందు కట్టు బానిసలుగా చేసేందుకు 39 కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేసిందని, నాలుగు లేబర్ కోడ్లను పారిశ్రామికవేత్తల ప్రయోజనాలకోసం ప్రవేశపెట్టిందన్నారు. ఈ సమావేశంలో సీతారామయ్య, రాసుద్దీన్, రామ్ సింగ్, వరప్రసాద్, కాంతారావు, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.