Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసినట్టు జడ్పీటీసీ పోశం నర్సింహారావు తెలిపారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు మణుగూరు మున్సిపాలిటీ పికే-1 సెంటర్ ఆదర్శ్నగర్కు చెందిన ఫరీనాబేగం రూ.60,000, చిట్టిబాబుకు మరో రూ.60,000 చెక్కులను అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం విజయకుమారి, పీఏసిఎస్ కుర్రి నాగేశ్వరరావు, టౌన్ అధ్యక్షులు అడపా అప్పారావు, ఉపాధ్యక్షులు జానీ, టీఆర్ఎస్ అధికార ప్రతినిధి ఎడ్ల శ్రీను, మిడియా ప్రతినిధి తాళ్లపల్లి యాదగిరిగౌడ్, కార్యదర్శి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.