Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
సింగరేణి అధికారులకు పీఆర్పీ డబ్బులు త్వరలో చెల్లిస్తామని సింగరేణి సీఎంఓఏఐ బ్రాంచ్ అధ్యక్షులు జక్కం రమేష్ అన్నారు. శుక్రవారం సీఎం ప్రధాన కార్యదర్శి ఎస్.నర్సింగరావు, కోల్ ఇండియా లిమిటెడ్ అధికారులకు సంబంధించి 2019-20 సంవత్సరానికి గాను పిఆర్పి ఫిబ్రవరి 2న చెల్లింపులు జరిగాయన్నారు. అదే విధంగా సింగరేణి అధికారులకు సంబంధించిన పిఆర్పిని కూడా త్వరగా చెల్లింపులు జరిగేలా సిఎంఓఏఐ అధికార సంఘం తరుపున వినపత్రం అందజేశారన్నారు. త్వరలోనే సింగరేణిలో కూడా పిఆర్పిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎస్వి రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.