Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి
విజబుల్ పోలీసింగ్ పటిష్టంగా అమలు : సీఐ సర్వయ్య
నవతెలంగాణ-గాంధీచౌక్
నేరాల నియంత్రణలో భాగంగా రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఖమ్మం త్రీ టౌన్ సిఐ సర్పయ్య తెలిపారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా సిఐ సర్పయ్య పర్యవేక్షణలో స్థానికుల భాగస్వామ్యంతో ఖమ్మం త్రీ టౌన్ కాలవొడ్డు ప్రాంతంలో బస్ స్టాప్ నుండి కౌండిన్య వైన్స్ షాప్ వరకు ఏర్పాటు చేసిన ఐదు సీసీ కెమెరాలను త్రీ టౌన్ సిఐ సర్వయ్య శుక్రవారం ప్రారంభించారు. ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిని సారించినట్లు తెలిపారు. నేరాల నియంత్రించేందుకు ప్రధాన రహదారులే కాకుండా అన్ని వీధుల్లోనూ సీసీ టీవిల నిఘా వుండబోతోందని తెలిపారు. అపరిచిత వ్యక్తుల కదలికలు, అసాంఘీక కార్యకాలపాలు, ఏ చిన్న నేర సంఘటన జరిగిన గుర్తించడానికి సీసీ కెమెరాలు ఎంతోగానో సహకరిస్తాయని అన్నారు. కమ్యూనిటీ పోలిసింగ్‌లో భాగస్వామ్యమై స్కూల్ కరస్పాండెంట్స్ స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో 3 టౌన్ ఎస్ఐ శ్రావణ్ మరియు షాప్ యజమానులు మరియు తదితరులు పాల్గొన్నారు.