Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెనుబల్లి
తెలంగాణ ముఖ్యమంత్రి దళిత సాధికారత కొరకు ప్రవేశపెట్టిన దళిత బంధుపథకం పెనుబల్లి మండలం, కొత్త కారాయిగూడెం గ్రామంలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక కావడంతో దళితులు ఆనందోత్సాహాలతో ర్యాలీ నిర్వహించారు. 75 మందికి అందిస్తున్నట్లు తెలపగా కొత్తకారాయి గూడెం గ్రామంలో దళితవాడ నందు ముఖ్యమంత్రి కెసిఆర్, సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య చిత్రపటాలకు పూలాభిషేకం చేసి దళితవాడ నందు మేళతాళాలతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు కనగాల వెంకట్రావు, గ్రామ సర్పంచ్ దొడ్డపనేని శ్రీదేవి రవి, చక్కిలాల మోహన్రావు, చక్కిలాల లక్ష్మణరావు, ఎంపీపీ సహాయకులు లక్కినేని అలేఖ్య వినీల్, మందడపు అశోక్, చింతనిప్పు సత్యనారాయణ, తాళ్లూరి శేఖర్ రావు, పెనుబల్లి విఎం బంజర్ సర్పంచ్ పంతులి, తావు నాయక్, ముక్కర భూపాల్ రెడ్డి, లగడపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.