Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
యస్.యన్ మూర్తి కళాశాల ఆవరణలో గల మైనారిటీ రెసిడెన్షియల్ మరియు ఇతర రెసిడెన్షియల్ పాఠశాలలను ఎమ్మెల్సీ నర్సిరెడ్డి శుక్రవారం సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యా యులతో ముచ్చటించారు . సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. మూఢ నమ్మకాలకు, మూఢ విశ్వాసాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు. భావి భారత పౌరులను తీర్చిదిద్దటంలో ఉపాధ్యాయులు శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు . ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వానికి నివేదించి పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేశారు. కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు జివి.నాగమల్లే శ్వరరావు, షేక్.జానీమియా, నాగుల్ మీరా గురుకుల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల హాజరు తక్కువగా ఉందని ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడాన్ని ఖండించిన టీఎస్ యుటిఎఫ్
జిల్లాలో విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉందని 19 మంది పాఠశాలల ప్రధానోపా ధ్యాయులకు జిల్లా విద్యాశాఖాధికారి షోకాజ్ నోటీసులు జారీ చేయడం సరికాదని, నోటీసులు ఉపసంహరించుకోవాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఉపాధ్యాయులు ఎంత కృషి చేసినప్పటికీ కోవిడ్ పరిస్థితులు, పిల్లల అనారోగ్యం, జాతరలు, ఇంకా అనేక ఇతర కారణాల వల్ల విద్యార్థులు పాఠశాలలకు రావడంలేదని కావున అధికారులు వాస్తవాలు గ్రహించాలని, నోటీసులు ఇచ్చి ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురి చేసే విధానాలను మానుకోవాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి.వి.నాగ మల్లేశ్వరరావు, పారుపల్లి. నాగేశ్వరరావు ఒక ప్రకటనలో జిల్లా విద్యాశాధికారిని డిమాండ్ చేశారు.