Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా
వైరా మార్కెట్ కమిటీ చైర్మన్‌గా మాజీ పోలీస్ అధికారి బీడీకే రత్నం శుక్రవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. కొంత కాలం నుండి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని దళితులకు కేటాయించాలన్న డిమాండ్ వినిపించింది.ఆ మేరకు వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్‌ను అనుసరిస్తున్న రత్నంకు చైర్మన్ పదవి దక్కింది. శుక్రవారం సాయంత్రం వైరా అయ్యప్ప దేవాలయం నుండి ఎమ్మెల్యే ఆద్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి మార్కెట్ యార్డుకు చేరుకున్న అనంతరం ఎమ్మెల్యే రాములు నాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్,సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ , జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూధన్, జడ్పి చైర్మన్ లింగాల కమలరాజ్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, రైతు సమన్వయ సమితి కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, వైరా ఎంపీపీ వేల్పుల పావని, మార్క్, మునిసిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, వైరా కొణిజర్ల జడ్పిటిసి సభ్యులు నబూరి కనకదుర్గ, పోట్ల కవిత, జడ్పి కో ఆప్షన్ సభ్యులు షేక్ లాల్ అహమ్మద్, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్లు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.తొలుత మార్కెటింగ్ జిల్లా అధికారి చైర్మన్ గా రత్నం,మిగిలిన పాలక వర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేశారు.