Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెనుబల్లి : అట్టడుగు వర్గాల హక్కుల గుండెచప్పుడు వేదగిరి శ్రీనివాసరావు అని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాసరావు, సిఐటియు జిల్లా నాయకులు చలమల విఠల్రావు అన్నారు. శుక్రవారం వేదగిరి రెండో వర్ధంతి సభ చలమల సూర్యనారాయణ భవనంలో గాయం తిరుపతి రావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కార్మిక సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శిగా, పార్టీ జిల్లా కమిటీ సభ్యులుగా, వైరా మండల పార్టీ కార్యదర్శిగా, ఎంపీపీగా పనిచేసిన ఆయన అట్టడుగు పేదల మన్నలను పొందారని అన్నారు. ఆచరణలో అనేక ఆటంకాలు, అవరోధాలు ఎదురైనా చివరి వరకు నమ్మిన సిద్ధాంతంకు కట్టుబడి పని చేసిన నాయకుడు అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం జరిగిన అనేక పోరాటాలలో అట్టడుగు వర్గాల అయినా వ్యవసాయ కార్మికులను కదిలించి జిల్లా వ్యాప్తంగా అనేక పోరాటాలు నిర్వహించారన్నారు. వారి ఆశయాన్ని కొనసాగించడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అన్నారు. అనంతరం వేదగిరి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో చిమట విశ్వనాథం, చలమల నరసింహారావు, రాజినేని మంగమ్మ, బాజీ, కుంజా రాములు, వడ్డెగ బజారు, పద్దం వెంకటేశ్వర్లు, పద్మ, తదితరులు పాల్గొన్నారు.
మధిర : సిపిఎం జిల్లా నాయకులు కామ్రేడ్ యాదగిరి శ్రీనివాసరావు వర్ధంతి పార్టీ కార్యాలయంలో తేలప్రోలు రాధాకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా నాయకులు శీలం నరసింహారావు మాట్లాడుతూ కామ్రేడ్ యాదగిరి శ్రీనివాసరావు నిరంతరం పేద ప్రజల సమస్యలపై ప్రజా ఉద్యమాలు నిర్వహించిన వ్యక్తి అని, వ్యవసాయ కూలీల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించారని, తన వ్యక్తిగత స్వార్థం లేకుండా నిత్యం పార్టీ అభివృద్ధి కోసం పాటుబడ్డ నాయకుడని ఆయనగారి జీవితం నేటి తరానికి మంచి ఆదర్శం అని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి మందా సైదులు, నాయకులు ఓట్ల శంకర్రావు, పెంటి వెంకట్రావు, తొర్లికొండ రామకిషోర్, వడిత్యా లాలూ, దుగ్గి నేని సూర్యప్రకాశరావు, తదితరులు పాల్గొని నివాళులర్పించారు.
ముదిగొండ : వ్యయప్రయాసలకోర్చి తను నమ్మిన సిద్ధాంతం కోసం కమ్యూనిస్టు గా కడవరకు నడచి అమరుడైన వేదగిరి శ్రీనివాసరావు ధన్యజీవని, సిపిఐ(ఎం) మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం,వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి వేల్పుల భద్రయ్య అన్నారు.వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సిపిఐ(ఎం) నేత వేదగిరి శ్రీనివాసరావు ద్వితీయ వర్ధంతిని ముదిగొండ మచ్చా వీరయ్య భవనంలో శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు మందరపు వెంకన్న, సిఐటియు మండల కన్వీనర్ టిఎస్ కళ్యాణ్, నాయకులు కట్టకూరు ఉపేందర్, కుర్రి ఉపేందర్, పుచ్చకాయల లక్ష్మయ్య, ఎన్ రాజు గోట్టెముక్కల దానయ్య పాల్గొన్నారు.
సత్తుపల్లి :పేద ప్రజల హక్కుల కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం జిల్లాలో స్వర్గీయ కామ్రెడ్ వేదగిరి శ్రీనివాసరావు నిర్వహించిన పోరాటాలు స్పూర్తిదాయకమని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాసరావు, సీఐటీయూ జిల్లా నాయకులు మోరంపూడి పాండురంగారావు అన్నారు. శుక్రవారం వేదగిరి శ్రీనివాసరావు వర్ధంతి సభను సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి రావుల రాజబాబు అధ్యక్షతన స్థానిక రావివీరవెంకయ్య భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులుగా, సీపీఐ(ఎం) వైరా మండల కార్యదర్శిగా, వైరా ఎంపీపీగా పలు పదవులలంకరించిన శ్రీనివాసరావు, ఏ పదవిలో ఉన్నా అనునిత్యం పేదల పక్షానే నిలబడి వారి సంక్షేమాభివృధ్ధి కోసం అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. వేదగిరి ఆయశ సాధన కోసం కృషి చేయడమే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో మోరంపూడి వెంకటేశ్వరరావు, ఐనంపూడి రవి, చావా భాస్కర్, మంచాల కన్నయ్య, రవి, సప్పిడి భాస్కర్, బాజీ, నాగరాజు పాల్గొన్నారు.