Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏడీకి సీపీఐ(ఎం) వినతి
నవతెలంగాణ- ఖమ్మం
డెవలప్మెంట్ చార్జీలు, సెక్యూరిటీ పేరుతో వేసిన చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సిపిఎం ఖమ్మం టూ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో మామిళ్ళగూడెం విద్యుత్ ఎస్ఈ కార్యాలయంలో ఏడికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై.విక్రమ్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా కరోనా విజృంభణ వల్ల జీవనం కష్టంగా మారిన పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన టిఆర్ఎస్ ప్రభుత్వం సామాన్య, మధ్య తరగతి ప్రజలు అల్లాడిపోయేలా భారాలు వేయడం సిగ్గుచేటు అన్నారు. విద్యుత్ బిల్లులు తగ్గిస్తామన్న ప్రభుత్వం అందుకు భిన్నంగా రకరకాల చార్జీలు పేరుతో అదనపు భారం వేయడంతో జిల్లా ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని పేర్కొన్నారు. గతంలో ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పేరుతో భారాలు వేసినట్టు ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పేరుతో వసూళ్లు చేయడం ప్రజలను మరింత ఆర్ధిక ఇబ్బందుల్లో పెడుతున్నారని ఆరోపిం చారు. గుట్టు చప్పుడు లేకుండా డెవలప్మెంట్ చార్జీలు, సెక్యూరిటీ పేరుతో చార్జీలు వసూలు చేస్తున్నారని విమర్శించారు. జిల్లా మంత్రి ఈ విషయంలో జోక్యం చేసుకుని భారాలు వేయకుండా ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్షణమే పెంచిన కరెంట్ బిల్లులు తగ్గించకపోతే జిల్లా ఎస్ఈ కార్యాల యాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో టూ టౌన్ సెక్రటరీ బోడపట్ల సుదర్శన్, నాయకులు నర్రా రమేష్, టి.ప్రకాష్, జె.వెం కన్నబాబు, కాంపాటి వెంకన్న, సిహెచ్ భద్రం, యాటా రాజేష్ తదితరులు పాల్గొన్నారు.