Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈఈ తీరుపై అన్నదాతల ఆగ్రహం
నవతెలంగాణ - బోనకల్
ఎండిపోతున్న మొక్కజొన్న ఇతర పంటలకు సాగునీరు అందించి కాపాడాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు మండల కేంద్రంలోని యన్ఎస్పి కార్యాలయంలో ముందు శుక్రవారం సుమారు గంట పాటు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా సమయంలోనే ఈఈ రామకృష్ణ ఎన్ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఈ సమయంలో ఈఈ సాగర్ నీటి విడుదలపై రైతులు పట్ల ఆయన వ్యవహరించిన తీరుపట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని కలకోట మేజర్ కింద నారాయణపురం, జానకిపురం, రాయన్నపేట, కలకోట గ్రామాలకు చెందిన అన్నదాతలు సుమారు నాలుగువేల ఎకరాలలో మొక్కజొన్న పంటను సాగు చేశారు. ఈ మొక్కజొన్న పంట సాగర్ నీరు అందక ఎండి పోతుంది. దీంతో అన్నదాతలు కడుపు మండి నేరుగా పొలాల నుంచే ఎన్ఎస్పీ కార్యాల యానికి చేరుకున్నారు. ఎండిపోతున్న పంట లను కాపాడాలంటూ యన్ఎస్పి కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నినాదాలతో ఆందోళన సాగించారు. ఇదే సమయంలో ఈఈ రామకృష్ణ ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. రైతులు తమ సమస్యలను ఆయనకు వివరించారు. అయితే ఈఈ బీబీసీ నుంచి ఆంధ్ర ప్రాంతానికి కూడా నీరు వెళ్లాలని పదేపదే అంటుండగా అన్నదాతలు తామ పొలాలు ఎండిపోతున్నాయని తాము అంటుంటే ఆంధ్రకు నీళ్లు ఇవ్వాలని అంటు న్నారు ఏంటి అంటూ ఆయనపై మండి పడ్డారు. కార్యాలయంలో రైతుల పక్షాన సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు ఈఈతో చర్చలు జరిపారు. బీబీసీ నుంచి నీరు కిందికి వెళ్లకుండా గేట్లు పూర్తిగా కిందకు దింపి కలకోట మేనేజర్‌కు పూర్తిస్థాయిలో సాగర్ నీరు వస్తేనే తమ పంటల ఎండిపోకుండా ఉంటాయని వివరించారు. ప్రస్తుతం కలకోట మేజర్ కు ఇవ్వవలసిన 101 క్యూసెక్కుల నీటిని ఇస్తున్నామని ఏ ఈ ఈ వనపర్తి నాగ స్పందన తెలిపారు. సాగర్ నీరు కిందకు వెళ్లకుండా గేట్లు దింపితేనే కలకోట మేజర్ చివరి భూములకు సాగర్ నీరు అందుతాయని లేకపోతే అందవని ఏ ఈ ఈ తెలిపారు. రైతుల ఆగ్రహంతో స్పందించిన ఈఈ రామకృష్ణ ఈ మూడు రోజులపాటు పూర్తిస్థాయిలో కలకోట మేనేజర్‌కు సాగర్ నీటిని సరఫరా చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. క్రమం తప్పకుండా వారంరోజులపాటు సాగర్ నీటిని విడుదల చేస్తేనే పంట చేతికి వస్తుందని రైతులు తెలిపారు. లేకపోతే కలకోట కింద సాగు చేసిన సుమారు నాలుగు వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట ఎండి పోతుందని, దానికి మీరే బాధ్యత వేయించాలని రైతులు హెచ్చరించారు. ఇప్పటికే ఎకరానికి 20 వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టామని రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.