Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ వ్యకాస జిల్లా అధ్యక్షుడు
మెరుగు సత్యనారాయణ
నవతెలంగాణ-ఖమ్మం రూరల్
ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసేందుకు బిజెపి కుట్ర పన్నుతుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మెరుగు సత్యనారాయణ అన్నారు. మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద గల తమ్మినేని సుబ్బయ్య భవన్ లోని వ్యవసాయ కార్మిక సంఘం కార్యాలయంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం సంఘం మండల కార్యదర్శి వడ్లమూడి నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయాలని బడ్జెట్లో తక్కువ నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ఉపాధి హామీ పథకానికి రెండు లక్షల కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తే గత సంవత్సరం కన్న కోత విధించడం దారుణమన్నారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పొన్నెకంటి సంగయ్య మాట్లాడుతూ పేదల కడుపు నింపే ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం కోత విధించడం సిగ్గుచేటన్నారు. ఉపాధి హామీ పథకాన్ని గ్రామాల నుంచి పట్టణాలకు విస్తరించాల్సిన తరుణంలో బడ్జెట్ లో నిధులకు కోత విధించడం హేయమైన చర్య అన్నారు. సంవత్సరంలో 200 రోజులు పని కల్పించాలని రోజుకు కనీసం వేతనం 600 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలను రాష్ట్ర ప్రభుత్వం నిలదీయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల నాయకులు కొర్నే వెంకయ్య, నెరేళ్ల ఉపేందర్,మద్ది వెంకట రెడ్డి, దుండిగల రాంబాబు, పెంట్యాల నాగేశ్వరరావు, కర్లపూడి వెంకటేశ్వర్లు, దొడ్డ వెంకటప్పయ్య, నాగయ్య, నందిగామ కృష్ణ, ఎల్.సైదులు తదితరులు పాల్గొన్నారు.