Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత
నామా నాగేశ్వరరావు
నవతెలంగాణ - బోనకల్
తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని ఖమ్మం ఎంపీ, టిఆర్ఎస్ లోకసభ పక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. మండల పరిధిలోని రావినూతల రైతు వేదికలో బోనకల్ మండలం లోని వివిధ గ్రామాలకు చెందిన 26 మంది లబ్ధిదారులకు 12 లక్షల రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులను జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజుతో కలిసి నామా నాగేశ్వరరావు ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి లబ్ధిదారులకు ఈ నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఖమ్మం జిల్లాలో వేలాది మందికి సిఎంఆర్ఎఫ్ నిధులను మంజూరు చేయించామని దీని వల్ల లబ్ధిదారులకు ఎంత ఉపయోగం జరిగిందన్నారు.
మోటమర్రి గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఎంపీగా గ్రామాల అభివృద్ధికి తన వంతు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం రావినూతల, జానకీ పురం, బ్రాహ్మణపల్లి, రాయన్నపేట గ్రామాలలో వారు సిసి రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. రావినూతల గ్రామానికి చెందిన కొమ్మినేని సీతారావమ్మ ఇటీవల మృతి చెందడంతో ఆమె చిత్రపటానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్ కు దిల్సుఖ్నగర్ డివిజన్ టిఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు బోడేపూడి జ్యోతి రిటైర్డ్ ఉపాధ్యాయుడు వాసిరెడ్డి సీతారామయ్య నామా నాగేశ్వరరావును శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, ఆత్మ కమిటీ జిల్లా చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ వేమూరి ప్రసాద్ రావు, మాజీ జెడ్పిటిసి బానోత్ కొండ, రావినూతల ఎంపిటిసి కందిమల్ల రాధ ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.