Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పలు డివిజన్లలో సీసీ రోడ్లను
ప్రారంభించిన పువ్వాడ
నవతెలంగాణ-గాంధీచౌక్
ఖమ్మం నగరాన్ని హైద్రాబాదు నగరానికి ధీటుగా అన్ని రంగాలలో అభివద్ధి పర్చి నగర ప్రజలకు అన్ని మౌళిక వసతులను కల్పించడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్ తెలిపారు. ఆదివారం సాయంత్రం నగరపాలక సంస్థ పరిధిలోని 58వ డివిజన్ రాపర్తినగర్, 17వ డివిజన్ శ్రీనివాసనగర్ రూ.88.70లక్షలతో నిర్మించిన సి.సి రోడ్లను నగర మేయర్ పూనుకొల్లు నీరజతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో ప్రత్యేక నిధులతో అత్యాదునికి సాంకేతిక పరిజ్ఞానంతో పటిష్టమైన, విశాలమైన సి.సి రోడ్లను నిర్మించడం జరుగుతుందన్నారు. ప్రతి డివిజన్లో సి.సి.రోడ్లు, డ్రైన్లు, డివైడర్లు, పార్కులు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసుకొని నగరాన్ని అభివృద్ధి పర్చడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ బచ్చు విజరుకుమార్, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు రంజిత్ కుమార్, నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమీషనర్ మల్లీశ్వరి కార్పోరేటర్లు దొరేపల్లిశ్శేత, దనాల రాధ, కొత్తపల్లి నీరజ, గజలక్ష్మి, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.