Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వారావుపేట
టీఆర్ఎస్ స్థానిక నాయకులు కాసాని చంద్రమోహన్ ఆర్ధిక సౌజన్యంతో రాష్ట్ర రవాణా శాఖా మాత్యులు పువ్వాడ అజరు కుమార్ ముఖచిత్రంతో ముద్రించిన 2022 క్యాలెండర్‌ను ఆదివారం ఖమ్మంలోని మంత్రి కార్యాలయంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన కాసాని చంద్రమోహన్‌ను అభినందించారు. అనంతరం పువ్వాడ మాట్లాడుతూ పువ్వాడ యువజన సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న పలు కార్యక్రమాలు వైరల్ అవడం విశేతను కలిగిస్తుందని తెలిపారు. ప్రత్యేకంగా యువజన సంఘం నాయకులను అభినందించారు. ఈ సందర్భంగా చంద్రమో హన్ మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రధాత మంత్రి పువ్వాడ అజరు కుమార్ అభిమానంతో అజరు కుమార్ ఫోటోతో కూడిన జై పువ్వాడ అనే క్యాలెండర్ అచ్చు వేయించామని పేర్కొన్నారు. వీటిని అశ్వారావుపేట మండలం వ్యాప్తంగా పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట సొసైటీ చైర్మన్ నూతక్కి నాగేశ్వరావు, వైస్ ఎంపీపీ ఫణీంద్ర, మోటూరి మోహన్ తదితరులు పాల్గొన్నారు.