Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ప్రధమ వర్ధంతి సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర
కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్
నవతెలంగాణ-ఇల్లందు
కార్మిక పక్షపాతి, సీపీఐ(ఎం) మాజీ పట్టణ కార్యదర్శి, సీఐటీయూ ఇల్లందు బ్రాంచీ మాజీ కార్యదర్శి దయ్యాల నాగేశ్వర్ కార్మిక సమస్యలపై అలుపెరగని పోరు సల్పిన నేతని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా నరసింహారావు, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు దేవులపల్లి యాకయ్య, మండల కార్యదర్శి అబ్దుల్ నబిలు కొనియాడారు. సింగరేణి ఎలక్రికల్ సూపర్ వైజర్‌గా గోదావరి ఖనిలో ఉద్యోగం చేస్తూ గత ఏడాది నాగేశ్వర్ గుండెపోటుతో మరణించారు. ఆయన ప్రధమ వర్ధంతి సభ ఏలూరి భవన్లో ఆదివారం కూకట్ల శంకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నాగేశ్వర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సభలో వారు పాల్గొని మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల సమస్యలపై అనేక పోరాటాలు, అలాగే కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్విరామంగా కృషి చేసిన మహనీయుడు నాగేశ్వర్ అని అన్నారు. కోయగూడెం సర్ఫేస్ మైనర్‌కు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అగ్రభాగాన నిలిచిన నాయకుడు అని అన్నారు. ఆయనకు నిజమైన నివాళి అర్పించడమంటే ఆయన నడిచిన బాటలో సమసమాజం నిర్మాణం కోసం అహర్నిశలు కృషి చేయాలని కోరారు. సభలో తాళ్లూరి కృష్ణ, ఆలేటి కిరణ్, మన్యం మోహనరావు, ఆలేటి సంధ్య, సుల్తానా, లక్ష్మి, మరియా, రాందాస్, వాసం రాము, పాలడుగు సుధాకర్, శంకర్, సలీం, కడారి వెంకటమ్మ, లక్ష్మణ్ పాసీ, యాకమ్మ, ఆర్.బీ.జే.రాజు, ముత్యాలు, రసూల్ బీ, వాసం మాధవి, బక్కయ్య, కోటమ్మ, సరిత శ్రీదేవి ఎన్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.