Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ నివాళ్లు అర్పించిన తుమ్మల, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు
నవతెలంగాణ-బూర్గంపాడు
బూర్గంపాడు మాజీ జెడ్పీటీసీ, తాళ్లూరి పంచాక్షరయ్య ట్రస్టు చైర్మెన్, తాళ్లూరి పంచాక్షరయ్య సతీమణి తాళ్లూరి భారతీదేవి అనారోగ్యంతో హైదరాబాద్లో శనివారం తెల్లవారుజామున మృతి చెందిన విషయం తెలిసిందే. ఆదివారం భారతీదేవి భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామమైన ఇరవెండికి ఆదివారం సాయంత్రం తీసుకువచ్చి గ్రామస్తుల సందర్శనకు ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, రేగా కాంతారావు, ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లులు భారతీదేవి భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తాళ్లూరి పంచాక్షరయ్య, కుటుంబ సభ్యులను వారు పరామర్శించి ధైర్యం చెప్పారు. అదేవిధంగా టీఆర్ఎస్ పాటు పలు పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు భారతీదేవి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఇరవెండి గ్రామంతో పాటు మండలంలో తాళ్లూరి ట్రస్టు ద్వారా సేవలందిస్తున్న పెద్ద కుటుంబంగా ఉన్న తాళ్లూరి కుటుంబంలో భారతీదేవి మరణాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోయారు. ఇదిలా ఉండగా కుమారులు అమెరికా నుంచి వస్తున్న కారణంగా అంత్యక్రియలను సోమవారం నిర్వహించనున్నారు. సంతాపం తెలిపిన వారిలో బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, ఏఎంసీ చైర్పర్సన్ ముత్యాలమ్మ, టీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశీకృష్ణ, టీఆర్ఎస్, పలు పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.