Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి
వర్గ సభ్యులు కె.బ్రహ్మాచారి
నవతెలంగాణ-భద్రాచలం
తొలితరం కమ్యూనిస్టు నాయకుడు, భద్రాచలం డివిజన్ సీపీఐ(ఎం) నిర్మాతల్లో ప్రముఖులు అమరజీవి బి.యస్.రామయ్య ఆదర్శ కమ్యూనిస్టు అని, ఆయన స్ఫూర్తితో ప్రజాసమస్యలపై పోరాటాలు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.బ్రహ్మాచారి అన్నారు. బి.యస్. రామయ్య 34 వర్ధంతి సభ బండారు చందర్రావు భవన్లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా బి.యస్.రామయ్య చిత్రపటానికి ఆయన సతీమణి కుసుమాంబ పూల మాలవేసి నివాళ్ళు అర్పించారు. ఈ సందర్భంగా బ్రహ్మాచారి మాట్లాడారు. ప్రజలతో మమేకమై పని చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. కూలీ, తునికాకు కట్టరేట్లు, పారెస్టు దోపిడికి వ్యతిరేకంగా బి.యస్. రామయ్య సమరశీల పోరాటాలు జరిపారని ఆయన అన్నారు. శ్రామిక ప్రజల ఐక్యత కోసం జీవితాంతం కృషి చేశారని పేర్కొన్నారు. ప్రస్ధుత పాలకులు కులం, మతం పేరిట ప్రజలను ముక్కలు ముక్కలు చీల్చు తున్నారని ఆయన అన్నారు. ఇటువంటి ప్రమాదక రమైన విధానాలను ప్రతిఘటిం చటమే బి.యస్. రామయ్యకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, వాస్తవ సమస్యలను పాలకులు పక్కదారి పట్టిస్తున్నాయని ఆయన విమర్శించారు. ప్రజా ఉద్యమాలపై పాలకులు తీవ్రనిర్భందాన్ని ప్రయోగిస్తున్నాయని ఈ నిర్భందా లను ప్రజా ఐక్యత తోటి తిప్పి కొట్టాలని అందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆయన అన్నారు. పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ పట్టణ నాయకులు బండారు శరత్ బాబు, బీమవరపు వెంకట రెడ్డి, వై.వెంకట రామారావు, యన్ నాగ రాజు, యం.వి.యస్.యస్ నారయణ తదితరులు పాల్గొన్నారు.