Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసి, దానికి బదులుగా డయల్ యువర్ కలెక్టర్ ఫోన్-ఇన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఆర్ఓ అశోక చక్రవర్తి తెలిపారు. సమస్య పరిష్కారానికి సంబంధించిన దరఖాస్తులు ఇచ్చేందుకు ప్రజలు కలెక్ట రట్కు రావాల్సిన అవసరం లేకుండా ప్రజలు ఎక్కడి నుండైనా మన జిల్లాకు చెందిన సమస్యలపై 08744-244888 నెంబర్కు కాల్ చేసి సమ స్యను తెలియచేయాలని కోరారు. ఉదయం 10.30 గంటల నుండి మధ్యా హ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్న ఈ డయల్ యువర్ కలెక్టర్ కార్యక్ర మానికి అధికారులు నిర్దేశిత సమయంలోగా హాజరు కావాలని సూచించారు.