Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జిల్లా టీబీ నియంత్రణాధికారి శ్రీనివాస్
నవతెలంగాణ-పినపాక
సబ్ నేషన్ సర్వేలో భాగంగా టీబీ వ్యాధి ఇంటిటి సర్వే ఎల్చరెడ్డిపల్లి గ్రామపంచాయతీలో ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ సర్వేను టీబి వ్యాధి నియంత్రణ జిల్లా అధికారి డాక్టర్ శ్రీనివాస్ ఆదివారం ఆకస్మికంగా పర్యటించి తనిఖీ చేశారు. అనంతరం ఆయన టీబీ సూపర్వైజర్ ప్రేమ్ కుమార్తో కలిసి పలు ఇళ్ల సర్వేలో పాల్గొన్నారు. అనంతరం ప్రజలతో మాట్లాడుతూ తేమడ నిర్ధారణ పరీక్షలు చేయించుకుని మందులు వాడాలని కోరారు. గ్రామాల్లో టీబీ వ్యాధిపై ఇంటింటి సర్వే నిర్వహించి తద్వారా 2025 కల్లా టీబీ నియంత్రణ లక్ష్యంగా పని చేస్తున్నమని పేర్కొన్నారు. టీబీ వ్యాధికి సంబంధించి పరీక్షలు మందులు పూర్తిగా ఉచితంగా ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. టీబీ వ్యాధి లక్షణాలు రెండు వారాలకు మించి దగ్గు, కళ్ళే రావటం, రాత్రి పూట చెమటలు పట్టడం, తరచు జ్వరం రావటం, ఆకలి లేకపోవటం, బరువు తగ్గడం ఉన్నవారు దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కళ్ళే నమూనాలు ఇచ్చినట్లయితే టీ-హబ్ వెహికిల్ ద్వారా సీబీనాట్ మిసషన్లో పరీక్షించి వారు ఇచ్చిన మొబైల్ నెంబర్కి పరీక్ష ఫలితాలు పంపిస్తారని తెలియజేసారు. కార్యక్రమంలో పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ శివ కుమార్, ఆశ కార్యకర్త జ్యోతి, వాలంటీర్ సింహాద్రి, సునీత, పాల్గొన్నారు.