Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం
అ బుద్దరాజు నరసింహారాజు (నవీన్‌బాబు)
నవతెలంగాణ-మణుగూరు
నేటి యువతరం క్రీడలకు ఆకర్షితమైతే చెడు వ్యసనాలకు దూరమవుతారని బుద్దరాజు. నరసింహా రాజు (నవీన్‌బాబు) అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కూనవరం పంచాయతీ పరిధిలో క్రీడా మైదానంలో ప్రథమ స్థాయి క్రికెట్ టోర్నమెంటును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువతరం క్రీడారంగంలో ప్రోత్సహిస్తూ, వారి బంగారు భవిష్యత్‌కు బాటలు వేసేందుకే జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో ప్రతిభ గల క్రీడాకారులకు వెలికితీసేందుకే భారీ స్థాయిలో క్రీడాపోటీలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇప్పటివరకు 42 టీంలు వచ్చాయని, సుమారు 12 రోజులపాటు నిర్వహించే ఈ క్రీడాపోటీలకు ప్రథమబహుమతి రూ.30,000, ద్వితీయబహుమతి రూ.20,000 అందజేస్తున్నా మన్నారు. ప్రతిరోజు పాల్గొన్న జట్టుకు, ప్రతి జట్టుకు బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్స్ మ్యాన్, మెమోటోస్ అందజేస్తామన్నారు. గ్రౌండ్ అందుబాటులో ఉన్నా రైల్వే ట్రాక్‌పై, వేదిక వెనుక ఉన్నా గుంతలోకి 6 కొడితే రూ.వెయ్యి నూట పదహార్లు ఇస్తామన్నారు. నవీన్‌బాబు ఆర్మీ ఆధ్వర్యంలో ప్రథమస్థాయి జిల్లా క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొంటున్న క్రీడాకారులు మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న పేదవారికి సాయం చేస్తూ, అన్నా అని పిలువగానే ముందుండి సాయం చేసే నవీన్‌బాబు ఆధ్వర్యంలో జరిగే క్రికెట్ పోటీల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. కూనవరం క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న క్రికెట్ పోటీలకు నిర్వహాకులుగా సాయికుమార్, రామ రాజు, శివ వ్యవహారిస్తున్నారన్నారు.