Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రూ.5 లక్షల రివార్డు గల మావోయిస్టు మృతి
అ ఆయుధం, పేలుడు పదార్థాలు
స్వాధీనం చేసుకున్న డీఆర్జీ జవాన్లు
నవతెలంగాణ-చర్ల
సరిహద్దు ఛత్తీస్ఘడ్ దంతెవాడ జిల్లా దండకారణ్యంలో పోలీసులు, మావో యిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. దంతెవాడ జిల్లాలోని బూర్గం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, డీఆర్జీ జవాన్ల మధ్య జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో ఒక మావోయిస్టు మృతి చెందారని ఆ జిల్లా ఎస్పీ సిద్ధార్థ తివారీ తెలిపారు. చనిపోయిన మావోయిస్టు పై రూ.5 లక్షల రివార్డు ఉందని తెలిపారు. మావోయిస్టును ఏరియా కమాండర్ అర్జున్ సోరిగా గుర్తించారు. బూర్గం అడవుల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టు నాయకులు గుమిగూడినట్లు పోలీసులకు సమాచారం అందిందని, ఈ సమాచారం మేరకు దంతేవాడ నుంచి డీఆర్జి దళాలను రంగంలోకి దిగినట్టు తెలిపారు. భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. సైనికులు ఎదురుదాడి చేయడం ద్వారా ప్రతీకారం తీర్చుకున్నారు. సైనికులు కాల్పులు జరిపిన తర్వాత సంఘటన స్థలాన్ని పరిశీలించినప్పుడు అక్కడ నుండి ఒక ఓ మావోయిస్టు మృతదేహాన్ని కనుగొన్నట్టు తెలిపారు. జవాన్లు ఘటనా స్థలంలోనే ఒక పిస్టల్, టిఫిన్ బాంబు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు మృత దేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.