Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
మనఊరు-మనబస్తీ-మనబడి కార్యక్రమం ద్వారా ఈ ఆర్ధిక సంవత్సరం మూడు వేల కోట్లతో 9123 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు నిధులు మంజూరు చేసినట్లు, విద్యారంగంలో అనూహ్యమైన మార్పులు రానున్నాయని, ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం, మన ఊరు-మనబడి కార్యక్రమంతో విద్యారంగంలో కొత్తరూపు రేఖలు రానున్నాయని రాష్ట్ర రావాణా శాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్ తెలిపారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో మన ఊరు, మనబస్తీ-మన పాఠశాల కార్యక్రమం అమలుపై విద్యా, మండల ప్రత్యేక అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమాశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలలు కొత్తరూపు రేఖలు దాల్చనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం విద్యాబోధనపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సుదీర్ఘ కసరత్తు చేసి సిఫారసు చేసినట్లు ఆయన వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి మాసాంతం వరకు ఎంపిక చేసిన అన్ని పాఠశాలల్లో 35 శాతం మౌలిక సదుపాయాలు కల్పన ప్రక్రియను పూర్తి చేయు విధంగా ఇంజనీరింగ్ అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. విద్యార్థుల హాజరు శాతం ప్రామాణికంగా తీసుకొని మొదటి దశలో 246 ప్రాధమిక, 57 ప్రాధమికోన్నత, 65 ఉన్నత పాఠశాలలు మొత్తం 368 పాఠశాలలను ఎంపిక చేసినట్లు చెప్పారు. మండలం యూనిట్‌గా తీసుకుని ప్రాథమిక, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలల నుండి నమోదు గల 35 శాతం పాఠశాలలను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఎంపిక చేయబడిన పాఠశాలల్లో 12 అంశాలతో బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నిరంతర నీటి సరఫరాతో మరుగుదొడ్లు, విద్యుద్దీకరణ, తాగునీరు, ఫర్నీచర్, పెయింటింగ్, పెద్ద, చిన్న తరహా మరమ్మతులు, ఆకుపచ్చ రాత బోర్డులు, ప్రహారీగోడ, వంటగది, శిథిల భవనాల స్థానంలో నూనత గదులు, బోజనశాల, డిజిటల్ సౌకర్యాలు కల్పన చేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
గ్రామంలో రూ.2 లక్షల వరకు విరాళం ఇస్తే ఏఎంసిలో చోటు కల్పిస్తామని, రూ.10 లక్షలు ఇస్తే తరగతి పేరు పెడతామని, రూ.1కోటి విరాళం ఇస్తే పాఠశాలకు నామ కరణం చేస్తామని దాతలు ముందుకు రావాలని ఆయన తెలి పారు. ప్రతి మండలానికి ఇంజనీరింగ్ అధికారులకు పర్య వేక్షణ బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. 35 శాతం విద్యా ర్థుల హాజరు ఉన్న పాఠశాలలను మొదటి దశలో ఎంపిక చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశా లలకు రంగులు, ప్రహరి నిర్మాణాలు, రూఫ్ మరమ్మతులు నిర్వహించి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాబోధన జరిగేందుకు ప్రక్షాళన చేయనున్నట్లు చెప్పారు.
పాఠశాలలను రక్షించుకోవాలి...ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
ప్రతి గ్రామానికి బడి, గుడి చాలా ముఖ్యమని నిరుపేద విద్యార్థులకు బాగా పయోగపడే కార్యక్రమమని చెప్పారు. విద్యకున్న ప్రాముఖ్యతను గుర్తించి ముఖ్యమంత్రి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేయుటకు కార్యాచరణ తయారు చేయడం సంతోషమని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపుతున్నారని, ఇక నుండి ప్రభుత్వ పాఠశాలలకు మహార్దశ వస్తుందని ఇక నుండి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకే రావాలని చెప్పారు. విద్యాదానం చాలా గొప్పదని, ఈ కార్యక్రమాన్ని అమలు చేయడంలో అధికారుల పాత్ర చాలా ముఖ్యమని ప్రభుత్వ లక్ష్యసాధనకు అధికారులు కంకణబద్దులై చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పారు. పాఠశాలలో ఫర్నీచర్ అపహరణకు గురికాకుండా కాపలాదారులను పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు.
భవిష్యత్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సౌకర్యాలు కల్పించాలి : ఎమ్మెల్సీ తాతా మధు
ప్రభుత్వం ప్రతిపాదించిన 12 అంశాలతో పాటు క్రీడలు, గ్రంధాలయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ మధు చెప్పారు. క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. శిధిలావస్థలో ఉన్న భవనాలు తొలగింపు తదుపరి నిర్మించనున్న తరగదుల్లో గాలి, వెలుతురు సమృద్ధిగా వచ్చేట్లు చూడాలని చెప్పారు. గతంలో పాఠశాలల్లో చదువ ుకుని స్థిరపడిన విద్యార్థుల జాబితాను సేకరించి బలోపేతం కొరకు విరాళాలు సేకరించాలని చెప్పారు. ప్రైవేట్ పాఠశా లలకు వెళ్లడానికి నిరుపేద విద్యార్థులకు ఇంగ్లీషు మీడి యంలో విద్యాబోధన చేయనున్నట్లు పేర్కొన్నారు. విద్యా ర్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున భవిష్యత్తుల అవస రాలను దృష్టిలో పెట్టుకుని సౌకర్యాలు కల్పించాలన్నారు. అనంతరం మన ఊరు-మనబడి, మన బస్తీ-మనబడి పాఠశాల నిర్వహణ కమిటీల కరదీపకిను మంత్రి అవిష్క రించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మెన్ కోరం కనకయ్య, జిల్లా కల్టెర్ దురిశెట్టి అనుదీప్, అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, కొత్తగూడెం, ఇల్లందు మున్సిపల్ చైర్పర్సన్లు కాపు సీతాలక్ష్మి, దమ్మాలపాటి వెంకటేశ్వరావు. మున్సిపల్ వైస్ ఛైర్మన్ దామోదర్, డీఈఓ సోమశేఖర్ శర్మ, మండల ప్రత్యేక అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.