Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
అ టేకులపల్లిలో ఘనంగా సన్మానం
నవతెలంగాణ-టేకులపల్లి
గ్రామపంచాయతీ కార్మికులు పోరాటాల ద్వారానే హక్కులు సాధించడం సాధ్యమౌతుందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. మండల కేంద్రమైన టేకులపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ కార్మికుల సమావేశం సీఐటీయూ మండల కన్వీనర్ కడుదుల వీరన్న అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు మొట్టమొదటిసారిగా పాలడుగు భాస్కర్‌ను టేకులపల్లి గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా శాలువాతో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడారు. గ్రామపంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ప్రధానంగా గ్రామపంచాయతీ కార్మికులకు ఎనిమిది గంటల పని దినాలు కల్పించాలని, కారో బార్లు, బిల్ కలెక్టర్లుకు ప్రత్యేక హౌదా కల్పించాలని, మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని, ప్రతి కార్మికుడికి యూనిఫామ్ ఇప్పించాలని, పీఆర్సీ అమలు చేయాలని ఎమ్మెల్యేలకు వినతి పత్రం అందజేయాలని కార్మికులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు సుధాకర్, జిల్లా అధ్యక్షుడు అప్పారావు, భూ నిర్వాసితుల సంఘం జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్, ఎస్.ఎ.నబీ, ఈసం నరసింహారావు, పంచాయతీ కార్మికులు మాలోతు సతీష్, మూడు బిచ్చు, రాంబాబు, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.