Authorization
Mon Jan 19, 2015 06:51 pm
క్షతగాత్రుడిని తన కారులో ఆస్పత్రికి తరలింపు
నవతెలంగాణ-బోనకల్
ద్విచక్ర వాహనం ఢకొీని గీత కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. రోడ్డుపై అచేతనంగా పడి పోయి సహయం కోసం ఎదురుచూస్తున్న క్రమంలో ఆ మార్గం మీదుగా వెళ్తున్న ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ఏవో డాక్టర్ కె రాజశేఖర్ గౌడ్ గాయాలతో హహకారాలు చేస్తున్న వ్యక్తిని గమనించి వెంటనే తన సొంత కారులో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఆస్పత్రిలో దగ్గర ఉండిమరి క్షతగాత్రుడికి మెరుగైన వైద్యం అందించారు. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బోనకల్ మండలం బ్రాహ్మణపల్లి చెందిన గుడిద వెంకటేశ్వర్లు అనే గీత కార్మికుడు ఆదివారం సాయంత్రం తాటి చెట్టు ఎక్కి తిరిగి తన టీవీఎస్ ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా ఎదురుగా వచ్చి ఓ వ్యక్తి బైక్‌తో వేంకటేశ్వర్లు ద్విచక్ర వాహనాన్ని ఢ కొట్టాడు. ఈ సంఘటనలో వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపడి రక్తస్రావంతో రోడ్డుపై సొమ్మసిల్లిపడిపోయిఉన్నాడు. ఈ క్రమంలో జిల్లా ప్రధాన ఆస్పత్రి ఏవో డాక్టర్ కేసగాని రాజశేఖర్ గౌడ్ కుటుంబంతో కలిసి నెమలి వెళ్లి సొంత గ్రామమైన పాలడుగు వెళ్తుండగా గాయాలతో ఉన్న వెంకటేశ్వర్లు పరిస్థితిని చూసి చలించిపొయి అక్కడ అందుబాటులో ఉన్న వెదురు బద్దలతో కాలు కట్టు కట్టి తన కారులో ఎక్కించుకొని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించారు. వెంకటేశ్వర్లు ను సకాలంలో ఆస్పత్రి తరలించి ప్రాణాలను కాపాడిన డాక్టర్ రాజశేఖర్ గౌడ్ ను పలువురు అభినందించారు. గతంలో డాక్టర్ రాజశేఖర్ గౌడ్ ఇదే తరహాలో రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు తన సొంత కారుని అంబులెన్స్ లా ఉపయోగించి సకాలంలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి ఎంతోమంది ప్రాణాలను కాపాడిన సందర్భాలు అనేకం.