Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు
డాక్టర్ ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్
కొండమల్లేపల్లి : తెలంగాణలో బహుజనుల రాజ్యం రావాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆదివారం కొండమల్లేపల్లి పట్టణంలోని స్థానిక చౌరస్తా సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో మంది విద్యార్థులు ఆత్మబలిదానాలతో సాధిం చినటువంటి తెలంగాణలో ఆదివాసీలకు బహు జనులకు లంబా డీలకు ఎలాంటి లాభం చేకూరడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఒంటెద్దు పాలన పరిపాలిస్తున్నాడు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపిం చారు. కార్యక్రమంలో బీఎస్పీ నియో జకవర్గ ఇన్చా ర్జి రమావత్ రమేష్ నాయక్, ఆయా మండలాల మండల అధ్యక్ష కార్యదర్శులు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.