Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునగాల
ప్రసన్న హాస్పిటల్ మునగాల వారి ఆధ్వ ర్యంలో ఆదివారం వరం గల్ శరత్ మాక్స్ విజన్ కంటి వైద్యశాల సహా కారంతో ఉచిత కంటి మేగా క్యాంపు నిర్వహిం చారు. మునగాల సర్పంచ్ చింత కాయల ఉపేందర్ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రసన్న హాస్పిటల్ అతి తక్కువ ఫీజుతో రోగులకు వైద్యసేవలు అందించటంతో పాటు నెలనెల వైద్య శిబిరాలు నిర్వహించటం అభినందనీయమని కొనియాడారు. గ్రామీణ ప్రాంత ప్రజలు వైద్యం కోసం పట్టణాలకు వెళ్ళే అవసరం లేకుండా అయిందన్నారు. సుమారు వంద మందికి కంటి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అశోక్ కుమార్, హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎల్.పి.రామయ్య, ఉప సర్పంచ్ ఎల్.వెంకయ్య, శరత్ కంటి ఆసుపత్రి సీనియర్ అప్త మాలజిస్ట్ విద్య అమోగ్, ఉదరు, ప్రవీణ్, ప్రసన్న హాస్పిటల్ సిబ్బంది గడ్డం సందీప్, ఉషా పాల్గొన్నారు.