Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్లూరు
మండలం పరిధిలోని తాళ్ళూరు వెంకటాపురంలో ప్రాథమికోన్నత పాఠశాలను ప్రకృతి వనాన్ని సోమవారం ఎంపిపి బీరవల్లి.రఘు, జడ్పిటిసి కట్టా.అజరు కుమార్, ఎండిఒ టీ.శ్రీనివాసరావు సందర్శించారు. గ్రామ సర్పంచ్ మెదుగు.సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రకృతి వనాన్ని సందర్శించి నర్సరీ నిర్వహణపై సంతృప్తిని వ్యక్తి చేసారు. మొక్కలు ఎండిపోకుండా చూడాలని కోరారు. అదే విధంగా మన ఊరు మనబడికి ఎంపికైనా పాఠశాలను సందర్శించి సౌకర్యాలు గుర్చి అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజనం పరిశీలించారు. విద్యార్థులకు రుచికరంగా వంట చేసి పెట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సుబ్బారావు, స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు మెరమ్మ, ఎస్ఎంసి చైర్మన్ ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు అంగన్వాడి టీచర్ గ్రామ పెద్దలు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.