Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ నూతన బస్టాండ్ ప్రారంభోత్సవంలో విప్ రేగా
నవతెలంగాణ-మణుగూరు
అభివృద్ధే లక్ష్యంగా పినపాక నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మోడల్‌గా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్ పినపాక శాస నసభ్యులు రేగా కాంతారావు అన్నారు. సోమవారం మున్సి పాలీటీ పరిధిలోని రూ.70 లక్షలతో సురక్షా బస్టాండ్‌ను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రూ.70 లక్షలతో అన్ని రకాల వసతులతో పాత బస్టాండ్ స్థలంలో నూతన బస్టాండ్‌ను ఆధునీకరించామన్నారు.పేద ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందు ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పోశం నర్సింహారావు, ఎంపీపీ కారం విజయకుమారి, పిఏసిఎస్ చైర్మెన్ కుర్రి నాగేశ్వరరావు, ఎస్కెటి గ్రూపు చైర్మెన్ వెంకటేశ్వరరావు, పట్టణ, మండల అధ్యక్షులు ముత్యంబాబు, అడపా అప్పారావు, అధిక సంఖ్యలో ప్రజా ప్రతినిధులు, ఇంచార్జ్ మున్సిపాలీటీ కమిషనర్ మాధవి, సర్పంచ్‌లు,ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.