Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అభివృద్ధి జరిగింది : ఆదాయ మార్గాలు అన్వేషించండి
అ మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశాల్లో కలెక్టర్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ
నవతెలంగాణ-ఇల్లందు
జిల్లాలో ఉత్తమ మున్సిపాలిటీగా మూడుసార్లు అవార్డు అందుకున్న ఇల్లందు రాష్ట్రంలోనే ఉత్తమ మున్సిపాలిటీగా ముందు వరుసలోనిలబడే విధంగా కృషి చేయాలని కలెక్టర్ అనుదీప్, ఎమ్మెల్యే హరిప్రియ, ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. కార్యాలయంలో సోమవారం 2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. మున్సిపల్ చైర్మెన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మున్సిపాలిటీ చరిత్రలో తొలిసారిగా బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. 2017 ముందు కంటే ప్రస్తుతం మున్సిపాలిటీ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.
మున్సిపాలిటీలోని కొన్ని వార్డుల్లో ప్రత్యక్షంగా పరిశీలన చేశామని అన్నారు. వార్డుల్లో కౌన్సిలర్లు పోటీలు పడి పారిశుధ్య కార్యక్రమాలు వివరములు చక్కగా నిర్వహిస్తున్నారని అన్నారు. మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పాలకవర్గం నిరంతరం అభివృద్ధికి కృషి చేయటం హర్షణీయమన్నారు. అభివృద్ధి వివరాలను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్వయంగా పరిశీలించారని అన్నారు. హైదరాబాదులో జరిగిన సమావేశాల్లో ఇల్లందు మున్సిపాలిటీని చూసి మిగతా మున్సిపాలిటీలో అభివృద్ధి పథంలో పయనించాలని అనడం సంతోషకరమన్నారు. పట్టణంలో పదివేల వరకు ఇండ్లు ఉండగా కేవలం నాలుగు వేల ఇండ్ల పనులు మాత్రమే వసూలు కావడం సరికాదన్నారు. ఆదాయం ఖర్చులు అభివృద్ధి బాధ్యత అంతా పాలకవర్గం అధికారులదే అన్నారు. అభివృద్ధికి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ అంజన్ కుమార్, వైస్ చైర్మన్ జానీ తదితరులు పాల్గొన్నారు.