Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో
జీపీ కార్యాలయం ముందు ధర్నా
నవతెలంగాణ-బూర్గంపాడు
బూర్గంపాడు మండలం సారపాక గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు సారపాకలో నెలకొన్న మంచినీటి సమస్య పరిష్కరించాలని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ సెక్రెటరీ మహేష్‌కు వినతిపత్రం అందజేశారు. మిషన్ భగీరథ మంచినీళ్లు ఎప్పుడు వస్తే అప్పుడే ఇస్తామని, ట్యాంకర్లతో నీరు సప్లై చేస్తామని సెక్రెటరీ మహేష్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత 15 రోజుల నుండి మిషన్ భగీరథ మంచినీరు గ్రామ ప్రజలకు రాక అనేకమైన ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు. అశ్వాపురం మండలంలో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి పదిహేను రోజులు అవుతున్నా మరమ్మతులు పూర్తి చేయలేదని ఆయన అన్నారు. దీనివల్ల సారపాకలో మంచినీటి సమస్య రోజు రోజుకీ తీవ్రత పెరుగుతుందని అన్నారు. వెంటనే మరమ్మతులు పూర్తిచేసి ప్రజలకు మంచి నీరు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. వెంటనే ఈ ప్రాంతానికి సంబంధించిన ఇబ్బందుల్ని పరిష్కరించటానికి సారపాక ఐటీసీ యాజమాన్యం ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు పాపినేని సరోజన, అఎస్కె అభిదా, కనకం వెంకటే శ్వర్లు, మరియమ్మ, విలాసాగర్, రజిని, లక్ష్మి, రమణా, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.