Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములకలపల్లి
ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికై తొలిసారిగా మండలానికి వచ్చిన చారుగుండ్ల శ్రీనివాసు ములకలపల్లి ఆర్యవ్యై సంఘం ఆధ్వర్యంలో సోమవారం శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ సంఘ అభివృద్ధికి సహాయపడాలని అధ్యక్షులు చారు గుండ్ల కోరారు. ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారం కోసం తానెప్పుడూ ముందుటావని ఈ సందర్భంగా వారుగుళ్ల హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు, ఆర్య వైశ్య సంఘ సభ్యులు పాల్గొన్నారు.