Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దమ్మపేట
మండలంలోని మందలపల్లి గ్రామంలోహై స్కూల్కు ఇటీవల ఉపాధి హామీ చట్టంలో రూ.9 లక్షల విలువైన సీసీ రోడ్ మంజూరు అయినందుకు ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఉప సర్పంచ్ గారపాటి సూర్యనారాయణ అనురాధ కృతజ్ఞతలు తెలియజేశారు. సోమవారం వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ కార్యాలయంలో ఎంపీ నామా నాగేశ్వరరావుని వారు కలిశారు. అదేవిధంగా రోడ్లో సీసీ రిటైనింగ్ వాల్ కోసం మరో రూ.10 లక్షలు మంజూరు చేయమని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.