Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రూ.50 వేలు ఆర్ధిక సహాయం చేసిన పొంగులేటి
నవతెలంగాణ-మణుగూరు
మండలంలోని బావి కూనవరం గ్రామంలో పద్మశ్రీ అవార్డు గ్రహిత సకిని రామచంద్రయ్యని వారి నివాసం వద్దకు వెళ్లి శాలువా కప్పి ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం ఘనంగా సన్మానించారు. అనంతరం వారికి రూ.50 వేలు ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో పినపాక మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, ఉమ్మడి ఖమ్మం జిల్లా డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, తెరాస రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకట్రావ్, అశ్వాపురం ఎంపీపీ, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.