Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జిల్లాకు మెడికల్ కాలేజీ రావడం అదృష్టం
అ కార్పొరేట్ స్థాయి వైద్యం
అందించేందుకు సిద్ధం
అ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్
డాక్టర్ కుమారస్వామి
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మారుమూల ఆదివాసీ, గిరిజన, పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా జిల్లాలో మెడికల్ కాలేజీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కాలేజీ ఏర్పాటుతో జిల్లాలోని పేద ప్రజలకు మెరుగైన ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ డాక్టర్ కుమారస్వామి స్పష్టం చేశారు. సోమవారం కొత్తగూడెం ఏరియా హాస్పిటల్లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 2022 మార్చి 31 నాటికి మెడికల్ కాలేజీ బోధన తరగతులతో కాలేజ్ సిద్ధం అవుతుందని తెలిపారు. మెడికల్ కాలేజీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం ఇక్కడి ప్రజలకు అదృష్టంగా భావించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 8 మెడికల్ కాలేజీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇతర ప్రాంతాల్లోని మెడికల్ కాలేజీల కంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మెడికల్ కాలేజ్ పనులు కలెక్టర్ చోరవతో వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. త్వరలో ఈ ప్రాంతాల ప్రజలకు ప్రత్యేక వైద్య (స్పెషలిస్టుల) సేవలు అందించేందుకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ మెడికల్ కళాశాలలో ఆసుపత్రి విభాగంలో 23 రకాల (స్పెషలిస్టు) ప్రత్యేక విభాగాల వైద్య, శస్త్ర చికిత్స, ఇతర సేవలు అందించేందుకు వైద్య సేవలు అందుబాటులో ఉన్నారని తెలిపారు. ప్రజలు ఈ అవకాశం వినియోగించుకోవాలని కోరారు. ఏరియా ఆస్పత్రి పైన మెడికల్ కాలేజ్ బోధన తరగతి విభాగం పనులు చురుగ్గా సాగుతున్న తీరు వివరించారు. నిర్మాణ పనులు పూర్తి చేసుకొని మార్చి 31 నాటికి బోధన తరగతులకు సిద్ధం కానున్నన్నట్లు తెలిపారు. ఈ ఏడాది మెడికల్ కౌన్సిలింగ్ అనంతరం 150 సీట్లతో వైద్య విద్యార్థుల బోధనకు రానున్నట్టు వివరించారు. ఈ అసుపత్రిలో శస్త్ర చికిత్సలు, జనరల్ మెడికల్, ప్రత్యేక వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. ప్రజలు ఏరియా ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న స్పెషాలిటీ వైద్య సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఈ విలేకర్ల సమావేశంలో మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణ్ రావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అనిల్, స్పెషలిస్ట్ డాక్టర్ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.