Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ బొగ్గుగనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూనంనేని దీక్ష
నవతెలంగాణ-కొత్తగూడెం
తెలంగాణలోని బొగ్గు బ్లాకుల ప్రైవేటికరణను వ్యతిరేకిస్తూ సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట మంగళవారం దీక్ష చేపట్టబోతున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్ పాషా, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కార్పొరేట్, కొత్తగూడెం బ్రాంచిల కార్యదర్శులు వంగా వెంకట్, జి.వీరస్వా మి ప్రకటనలో తెలిపారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనం నేని సాంబశివరావు ఆధ్వర్యంలో వందలాది మందితో దీక్ష చెవుడుతున్నట్లు పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసే చర్యలకు పూనుకుంటోందని విమర్శించారు. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే చర్యలకు పాల్పడుతోందన్నారు. ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. యూనియన్లు, పార్టీలకతీతంగా జరిగే దీక్షకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలపాలని కోరారు.