Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రెడ్ బుక్ డే కార్యక్రమంలో
సీపీఐ(ఎం) సీనియర్ నేత కాసాని
నవతెలంగాణ-కొత్తగూడెం
కార్మిక వర్గ విప్లవ దిక్సూచి మార్క్స్ ఎంగెల్స్ రాసిన కమ్యూనిస్టు ప్రణాళిక అని సీపీఐ(ఎం) సీనియర్ నేత కాసాని అయిలయ్య అన్నారు. కమ్యూనిస్టు ప్రణాళిక రచించి 174 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా స్థానిక మంచికంటి భవన్లో సామూహిక కమ్యూనిస్టు ప్రణాళిక అధ్యయనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా రెడ్ బుక్ 'డే' కార్యక్రమం నిర్వహించి కమ్యూనిస్టు ప్రణాళిక దాని గొప్పతనాన్ని శ్రామిక ప్రజానీకానికి వివరించాలని ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం పిలుపు నిచ్చిన నేపథ్యంలో కమ్యూనిస్టు ప్రణాళిక పుస్తకాన్ని అధ్యయనం చేసి దాని ప్రాధాన్యతను వివరించాలన్నారు. దోపిడీకి గురయ్యే కార్మికవర్గం తమ దోపిడీ నుంచి విముక్తి అయ్యే మార్గాన్ని అన్వేషించడంలో కార్మిక వర్గ విప్లవానికి చోదక శక్తిగా ప్రణాళికాబద్ధమైన పోరాటాలు నిర్వహించడానికి మార్క్స్ ఎంగెల్స్ రాసిన కమ్యూనిస్టు ప్రణాళిక కార్మిక ఉద్యమానికి అద్దంలాంటిదన్నారు. ప్రతి కమ్యూనిస్టు కచ్చితంగా కమ్యూనిస్టు ప్రణాళిక అధ్యయనం చేయడం దానిని ఆచరిస్తూ కార్మిక విప్లవంలో భాగస్వామ్యం కావడం కీలక కర్తవ్యంగా ఉంటుందని ఆయన అన్నారు. మార్క్సు ఎంగెల్సు కమ్యూనిస్టు సాహిత్యాన్ని విస్తృతంగా చదవాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి లిక్కి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎంవి.అప్పారావు, సీపీఐ(ఎం) పట్టణ కమిటీ సభ్యులు సందకూరి లక్ష్మి, డి.వీరన్న, నందిపాటి రమేష్, ఎంఎస్.ప్రకాష్, కూరపాటి సమ్మయ్య, గాజుల రాజారావు, మేకల రాయమల్లు, పాషా, గడల నరసింహారావు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
కమ్యూనిస్ట్ల అవసరం పెరిగింది
మాజీ ఎంపీ మిడియం బాబూరావు
భద్రాచలం : నేడు కమ్యూనిస్టుల అవసరం పెరిగిందని, కమ్యూనిస్టు రాజ్యం స్థాపించడం ద్వారానే అసమానతలు లేని సమాజం ఏర్పడుతుందని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు, భద్రాచలం మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబూ రావు అన్నారు. సీపీఐ(ఎం) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన జరిగిన రెడ్ బుక్ డే కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొని ముఖ్య అతిథిగా ప్రసంగించారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మతోన్మాద ఫాసిస్టు ధోరణులు ఊపందుకుంటాయని ఆయన అన్నారు. బడుగు, బలహీన వర్గాలపై, కార్మికులపై, పేదలపై దాడులు పెరిగాయని ఆయన అన్నారు. కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ ప్రజలపై భారాలు మోపుతున్న నేటి తరుణంలో కమ్యూనిస్టు అవసరం పెరిగిందని ఆయన అన్నారు. బూర్జువా వ్యవస్థ ను కూకటివేళ్లతో పెకలించి ఆయుధమే కమ్యూనిస్టు ప్రణాళిక అని ఆయన అన్నారు. కమ్యూనిస్టు ప్రణాళిక పుస్తక మును విస్తృతంగా కార్మికులు, పేదలు, మేధావులలోకి తీసు కోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం) జిల్లా కమిటీ సభ్యురాలు ఎం.రేణుక, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బి.వెంకట రెడ్డి, వై.వెంకటరామారావు, ఎం.లీలావతి, పి.సంతోష్ కుమార్, సీతా లక్ష్మి, యు.జ్యోతి, కుంజా శ్రీనివాస్, లక్ష్మణ్, జీవనజ్యోతి, మందా రమయ్య, ఎన్.వి.ఎస్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
సమస్యల నిర్మూలనకు
మార్క్స్ బోధనలే పరిష్కారం
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు
ఇల్లందు : దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి కారల్ మార్క్స్ ఎంగెల్స్ రచించిన బోధనలే పరిష్కారమార్గం చూపుతాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ అన్నారు. ఏలూరిభవన్లో సోమవారం ఆలేటి కిరణ్ కుమార్ అధ్యక్షతన రెడ్ బుక్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కారల్ మార్క్స్ ఎంగెల్స్ రచనల బోధనల ఆధారంగానే నేడు కమ్యూనిస్టు దేశాలు, కేరళలోని సీపీఐ(ఎం) ప్రభుత్వం అనుసరిస్తూ పేదరికం నిర్మూలన, ఉద్యోగాల కల్పనకు విద్య వైద్యం సకల సదుపాయాలు కల్పించడంలో ముందు ఉంటున్నాయని అన్నారు. శ్రమ చేసే శ్రామికుడు, అతని శ్రమను దోచుకునే దోపిడీదారు (పెట్టుబడి దారుడు) గురించి విశ్లేషణ చేశారని ఇప్పటికీ ప్రపంచ దేశాలు సంక్షోభం నుంచి కోలుకోడానికి మార్క్స్ రచించిన గ్రంధాన్ని చదువుకుంటున్నారని అన్నారు. నాడు మార్క్స్ రచించిన గ్రంధాన్ని నేటి సమాజంలో కూడా అన్వయుంచుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మందా సుధాకర్, అబ్దుల్ నబి, తాళ్లూరి కృష్ణ, కిరణ్, మన్యం మోహన్ రావు, సంధ్య సుల్తానా, లక్ష్మీ, మరియా, యకమ్మ, రాము, రాందాస్,సలీం, శంకర్, రాజు, ముత్యాలు, లక్ష్మణ్ పాశీ తదితరులు పాల్గొన్నారు.