Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ నివాళులర్పించిన ఎంపీ, జడ్పీ, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీలు
నవతెలంగాణ-బూర్గంపాడు
బూర్గంపాడు మాజీ జెడ్పీటీసీ, తాళ్లూరి పంచాక్షరయ్య ట్రస్టు చైర్మన్, తాళ్లూరి పంచాక్షరయ్య సతీమణి తాళ్లూరి భారతీదేవి భౌతికకాయాన్ని సోమవారం ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకట్రా వు, కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షులు కోనేరు చిన్ని, పోట్ల నాగేశ్వరరావు, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మాజీ ఎంపీ పోరిక బలరాంనాయక్ తదితరులు సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తాళ్లూరి పంచాక్షరయ్య, కుటుంబసభ్యులు తాళ్లూరి రాజాశ్రీకృష్ణ, జయశేఖర్, బంధువు రాజ్యసభ్య సభ్యులు రమేష్, వంశీకృష్ణలను వారు పరామర్శించారు.
అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు :
తాళ్లూరి భారతీదేవికి అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. భారతీదేవిని కడసారి చూసేందుకు వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు ఇరవెండి గ్రామానికి పెద్ద ఎత్తున తరలివచ్చి కన్నీరుమున్నీరుగా విలపించారు. భారతీదేవి అంతిమయాత్రలో తదితర గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని భారతీదేవికి అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. ఇరవెండిలోని స్మశానవాటికలో అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు జడ్పీటీసీ శ్రీలత, ఏఎంసీ చైర్పర్సన్ ముత్యాలమ్మ, టీఆర్ఎస్ మండల పార్టీ, వర్కింగ్ అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, జలగం జగదీష్, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ వంశీకృష్ణ, టీఆర్ఎస్, పలు పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.