Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెనుబల్లి
కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తే సొంత ఆస్తిని రద్దు చేస్తామంటున్నారనేది బూర్జువా శక్తుల తప్పుడు ప్రచారమని జిల్లా ఎకడామిక్ బాధ్యులు మల్లెంపాటి వీరభద్రం పేర్కొన్నారు. సోమవారం సిపిఎం మండల కార్యదర్శి గాయం తిరుపతి రావు అధ్యక్షతన రెడ్ బుక్పై విశ్లేషణాత్మక జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూర్జవ రూపాలు దాని భావజాలం సంస్కృతి శాశ్వతంగా ఉండబోవని, బూర్జువ సంబంధాలు మాయం కావడంతోనే అవి కూడా అంతరించిపోతాయన్నారు. అభివృద్ధి నిరోధక శక్తులను ఓడించడానికి బూర్జవ వర్గానికి చెందిన రాజకీయ పార్టీలతో కలవడంపై వివరణ ఇచ్చారు. పార్లమెంటరీ పదవులు లేకపోయినా ప్రతి విప్లవ ఉద్యమాన్ని కమ్యూనిస్టులు బలపరుస్తారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చలమాల విఠల్రావు, మామిళ్ల వెంకటేశ్వర్లు, సండే సత్యం, చలమాల నరసింహారావు, తాండ్ర రాజేశ్వరరావు, మేకల బాజీ, గుడిమెట్ల బాబు, తదితరులు పాల్గొన్నారు.