Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్, అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ సహకారంతో స్కోప్ ఆర్డీ చైల్డ్ లైన్-1098 ఆధ్వర్యంలో కోవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన బాల,బాలికలకు మండల పరిధిలో జలగంనగర్లోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిత్యావసరాలను అందజేశారు. ఈ సందర్భంగా సీడబ్ల్యుసీ చైర్ పర్సన్ భారత రాణి మాట్లాడారు. బాల బాలికలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా ఆ సమస్యల పరిష్కారం కోసం చైల్డ్ లైన్,సీడబ్ల్యుసీ వారు కృషి చేస్తారని వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ బెల్లం ఉమ, ఎంపీడీవో అశోక్ కుమార్, ఐసీడీఎస్ సీడీపీవో సరస్వతి, సూపర్వైజర్ సువర్చల, చైల్డ్ లైన్ సభ్యులు ధనలక్ష్మి, అనూష మహొత్ గురుమూర్తి, వెంకటేష్ పాల్గొన్నారు.