Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
మానవాళి సకల సమస్యలకు పరిష్కారం మ్యానిఫెస్టో అని, దోపిడిని నివారించే మంత్రం మ్యానిఫెస్టో అని ప్రముఖ రిటైర్డ్ లెక్చరర్ టి ఎల్ నర్సయ్య అన్నారు. సోమవారం స్థానిక నవతెలంగాణ బుకహేౌస్లో యువజన రంగం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయంగా జరుగుతున్న మ్యానిఫెస్టో డే సందర్భంగా జరిగిన సామూహిక అధ్యయనం కార్యక్రమంలో భాగంగా జిల్లా అధ్యక్షుడు మద్దాల ప్రభాకర్ అధ్యక్షతన స్టడీ సర్కిల్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సకల మానవాళి సమస్యల పరిష్కారానికి మేనిఫెస్టో దారి చూపుతుందని, ఇది కారల్ మార్క్స్,ఎంగిల్స్ 174 సంవత్సరాల క్రితం రాసిన పుస్తకం అని, ఈ పుస్తకం పెట్టుబడిదారీ దోపిడీపైన ఎక్కుపెట్టి వదలిన రామబాణం అని అన్నారు. యువజన సంఘం జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ మాట్లాడుతూ మానవాళికి మంచి రోజులు రావాలని రాసిన పుస్తకం మేనిఫెస్టో అని, దోపిడీ రహిత సమాజ నిర్మాణం ఖచ్చితంగా జరిగి తీరుతుందని, ఈ పుస్తకం చదివితే అర్థమవుతుందని అన్నారు. ఈ పుస్తకం కార్మిక, కర్షక, మధ్యతరగతి, ఇతర సమస్త ప్రజల చేతిలో తిరుగుబాటు ఆయుధమని, ఆయుధం ఉపయోగించుకొని దోపిడి సమాజాన్ని కూలదోసి, అత్యంత మానవ విలువలు అయినటువంటి సమాజం నిర్మించుకోవాలని, అందుకే ఈ పుస్తకం అందరూ చదివి సమాజ మార్పుకు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువజన రంగం జిల్లా నాయకులు చింతల రమేష్, షేక్ రోషన్ బేగ్, సత్తెనపల్లి నరేష్, శీలం వీరబాబు, షేక్ రోషిని ఖాన్, దిండు మంగపతి, కణతాల వెంకటేశ్వర్లు, కూరపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు