Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
డెవలప్మెంట్ ఛార్జీల పేరుతో విద్యుత్తు అధికారులు వినియోగదారులకు రూ.వేలకు,వేలు కరెంట్ బిల్లులు వేస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్ అన్నారు. మండల పరిధిలో వరంగల్ క్రాస్ రోడ్డులోని తమ్మినేని సుబ్బయ్య భవన్లో సోమవారం సీపీఎం ఖమ్మం రూరల్ మండల కమిటీ జనరల్ బాడీ సమావేశం పొన్నెకంటి సంగయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడారు. సామాన్య ప్రజలకు విద్యుత్తు బిల్లుల మోత కంటిమీద కునుకు లేకుండా చేస్తుందన్నారు. కూలీ చేస్తేగాని పూటగడవని పేద వారు కూడా నాలుగు వేల రూపాయల విద్యుత్తు బిల్లులు చెల్లించాలంటే, వారు జీవనం ఎలా సాగిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు ప్రజలపై మోపుతున్న అదనపు ఛార్జీల వసూలను నిలిపివేసి, విద్యుత్తు ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళనలు, పోరాటాలు నిర్వహి స్తామన్నారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్, జిల్లా కమిటీ సభ్యులు ఉరడీ సుదర్శన్ రెడ్డి, మండల నాయకులు నందిగామ కృష్ణ, యామిని ఉపేందర్, వడ్లమూడి నాగేశ్వరరావు, ఏటుకూరి ప్రసాద్ రావు, భూక్య నాగేశ్వరరావు, ధనియకుల రామయ్య, రంజాన్, మెడికొండ నాగేశ్వరరావు, పాపిట్ల సత్యనారా యణ, రాంబాబు, వరగాని మోహన్రావు, పద్మ, మల్సూర్, యాదగిరి పాల్గొన్నారు.