Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ముదిగొండ
మండల పరిధిలో గోకినేపల్లి, ముదిగొండ గ్రామాలకు చెందిన కృష్ణసాగరపు శ్రీనివాసరావు, కమర్తపు కళావతిలు సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క సిఫారసు మేరకు మంజూరు అయిన రూ42 వేల రూపాయల విలువ చేసే సీఎం సహాయనిధి చెక్కులను బాధితుల ఇండ్లకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్మినేని రమేష్ బాబు ఆధ్వర్యంలో సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జడ్పిటిసి మాజీ బుల్లెట్ బాబు, నాయకులు కొత్తపల్లి ప్రసాద్, కొత్తపల్లి శ్రీను, ఐఎన్టియుసి మండల అధ్యక్షులు ఉసికల రమేష్, ఎస్కె నాగులుమీరా, మీగడ నాగేశ్వరరావు, ఎస్కె మీరాసాహెబ్ పాల్గొన్నారు.