Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్యే వనమా
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం పట్టణంలో నివసిస్తున్న ప్రతి పేదవాడి ఇంటికి హక్కు కల్పించడమే నా జీవిత లక్ష్యమని స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం కొత్తగూడెం క్లబ్లో జివో76 ఇండ్ల స్థల లాల క్రమబద్ధీకరణ పట్టాలు పంపిణీ చేశారు. అనం తరం జరిగిన సభలో ఎమ్మెల్యే వనమా మాట్లాడారు. కొత్తగూడెం పట్టణంలో నివసిస్తున్న ప్రతి పేదవాడి ఇంటికి హక్కు కల్పించడమే తన లక్ష్యమని, తన జీవితం ప్రజాసేవకే అంకితం అని, ప్రజల గుండెల్లో చిర స్థాయిగా నిలిచి పోవడమే నా ధ్యేయమని తెలిపారు. అర్హత ఉన్న వారికి పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి, వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, తహసీల్దార్ రామకృష్ణ, మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ నవీన్, రెవెన్యూ అధికారులు, 36వార్డ్ల కౌన్సిలర్లు పాల్గొన్నారు.