Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ విలేఖర్ల సమావేశంలో
టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు
నవతెలంగాణ-ఇల్లందు
ఉక్కు పరిశ్రమకు అవకాశం లేదని బీజేపీ కేంద్ర మంత్రి అనడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ నేడు బయ్యారం మండల కేంద్రంలో ఎమ్మెల్యే హరిప్రియ ఆధ్వర్యంలో నిరసన దీక్ష జరగనున్నట్లు పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు కే.నాగేశ్వ రావు, పరుచూరి వెంకటేశ్వర్లు, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ సయ్యద్ జాని పాషా తెలిపారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అన్నారు. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన బయ్యారం ఉక్కు పరిశ్రమకు ఫీజుబులిటీ లేదని కేంద్ర మంత్రి ప్రకటించడం సరికాదని అన్నారు. అనేక పరిశీలనలు, పరిశోధనల తర్వాత వచ్చిన నివేదికలు ఉక్కు పరిశ్రమకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమాలో పట్టణ ఉపాధ్యక్షుడు అబ్దుల్ నబీ, గుండ శ్రీకాంత్, నవాబ్ పాల్గొన్నారు.
టేకులపల్లి సహాయ కేంద్ర హౌంశాఖ మంత్రి కిషన్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బయ్యారం ఉక్కుపై చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ నిరసనగా నేడు ఇల్లందు నియోజక వర్గం శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ నాయక్ బయ్యారంలో చేపట్టిన దీక్షను జయప్రదం చేయాలని చేయాలని ఇల్లందు మార్కెట్ యార్డ్ చైర్మన్ భానోత్ హరి సింగ్ నాయక్ పిలుపునిచ్చారు. మంగళవారం టేకులపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీటీసీలు బాలకృష్ణ, జాలాది అప్పారావు, టీఆర్ఎస్ మండల మండల ప్రధాన కార్యదర్శి బోడా బాలునాయక్, సత్యనారాయణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.