Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జీపీ కార్మికుల వేతనాల సమస్యను
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి
అ సీఐటీయూ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు వినతి
నవతెలంగాణ-భద్రాచలం
గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) అను బంధ సంఘం భద్రాచలం నియోజకవర్గ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే పొదెం వీరయ్య మాట్లాడుతూ న్యాయమైన సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వం, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం జరిగిన సమావేశంలో శ్రామిక మహిళా జిల్లా కన్వీ నర్ జె.పద్మ, సీఐటీయూ పట్టణ కన్వీనర్ వై.వి.రామారావులు మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని వారు అన్నారు. అనేక ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కార్మికులకు కొద్దోగొప్పో వేతనాలు పెంచినప్పటికీ గ్రామపంచాయతీ కార్మికులను పట్టించుకోకుండా వెట్టిచాకిరి చేస్తున్నారని ఆరోపించారు. కేటగిరీల వారీగా ప్రమోషన్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కనీస వేతనం అమలు చేయకుండా ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులను వెట్టిచాకిరీ చేస్తుందని అన్నారు. జీపీ కార్మికుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష పాలకపక్ష ఎమ్మెల్యేలకు తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సీఐటీయూ తీసుకుందని ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె చేయకతప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ నాయకులు ఎన్.నాగరాజు, గ్రామ పంచాయితీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు కాపుల రవి, విజరు, రేవతి, కన్నయ్య, నరసింహా రావు, నరేష్, కృష్ణార్జున రావు, నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.