Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ 11న మహా పట్టాభిషేకం
అ శ్రీరామనవమి దర్శన సెక్టార్ల
టికెట్ల రుసుముల పెంపు
అ ప్రత్యక్షంగా హాజరుకాలేని
భక్తులకు పరోక్ష సేవలు
అ భద్రాద్రి దేవస్థానం ఈవో బి.శివాజీ
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు 2022 సందర్భంగా భక్తులకు అవసరమైన ఏర్పాట్లను చేపట్టనున్నట్లు దేవస్థానం ఈవో బి.శివాజీ తెలిపారు. మంగళవారం భద్రాచలంలోని స్థానిక తానీషా కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఈఓ వెల్లడించారు. ఈ సారి స్వామి వారి బ్రహ్మౌత్స వాలు ఏప్రిల్ 2 నుంచి 16 వరకు నిర్వహించనుండగా 10న శ్రీరామనవమి నాడు శ్రీ సీతా రాముల కల్యాణ తిరుకల్యాణ మహౌత్సవంను తిలకించేందుకు సెక్టార్ల రుసుములను పెంచనున్నట్లు పేర్కొన్నారు. కల్యాణంను తిలకించే ఉభయదాతలకు గతంలో టికెట్ల రుసుము రూ.5 వేలు టికెట్ ఈసారి నుంచి రూ.7,500గా పెంచడం జరిగిందని ఆయన అన్నారు. ఈ టికెట్ కొనుగోలు చేసిన వారిని ఉభయదాతలను సెక్టార్లోకి అనుమతించడం జరుగుతుందన్నారు. అలాగే రూ.2 వేల టికెట్టు రూ.2,500, రూ.1,116 టికెట్ రూ.2000, రూ.500 టికెట్ రూ.1000, రూ.200 టిక్కెట్ రూ.300, రూ.100 టికెట్ రూ.150గా రుసుములు ఖరారు చేసినట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్ 11న మహా పట్టాభిషేకం రోజున ఉభయదాతల టికెట్ రూ.250 గతంలో ఉండగా దానిని రూ.1000కి పెంచినట్లు ఆయన తెలిపారు. ప్రత్యక్షంగా శ్రీరామనవమికి హాజరుకాలేని భక్తుల సౌకర్యార్థంగా పరోక్ష సేవలు పోస్టల్ శాఖ ద్వారా అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పరోక్ష సేవా రుసుము రూ.5 వేలు ఉంటుందని ఇందులో గోత్రనామాలతో అర్చన, శేష వస్త్రాలు, ఐదు ముత్యాలతో తలంబ్రాల ప్యాకెట్, కుంకుమ, ప్రసాదం ఉభయదాతలకు ఇస్తామని ఆయన తెలిపారు. రూ.1100 టికెట్కు గోత్రనామాలతో అర్చన, రెండు ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లు, కుంకుమ, ప్రసాదం ఇవ్వను న్నట్లు తెలిపారు. దేవస్థానంకు రూ.25 లక్షలు పైబడి విరాళం సమర్పించిన దాతలకు శ్రీరామనవమి కల్యాణం నిమిత్తం 1సి సెక్టార్లో రెండు ఫ్లవర్ బ్యాడ్జీలు ఉచితంగా అందజేయాలని నిర్ణయించినట్లు ఈఓ తెలిపారు. ఈ టికెట్ల విక్రయాల ద్వారా రూ.2 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా ఉందని ఆయన తెలిపారు. దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీరామనవమి బ్రహ్మౌత్స వాలను పురస్కరించుకొని ఈసారి పెంచిన టికెట్ల రుసుములతో దేవస్థానంకు రూ.2 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. గత రెండేళ్లుగా శ్రీరామనవమి, వైకుంఠ ఏకాదశి ఉత్స వాలను కోవిడ్ వైరస్ వల్ల నిర్వహించ లేకపోయా మని తెలిపారు. ఈ సమావేశంలో ఈవోతోపాటు ఏఈవో శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.