Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ నివాళులర్పించిన చైర్మన్ దమ్మాలపాటి
అ అంత్యక్రియలకు రూ.10వేల అందజేత
నవతెలంగాణ-ఇల్లందు
పట్టణంలోని 17వ వార్డుకు చెందిన మున్సిపల్ కార్మికురాలు మినుముల మరియమ్మ (58) అనారోగ్యంతో సోమవారం రాత్రి మృతి చెందారు. మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, కమిషనర్ అంజన్ కుమార్ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంత్యక్రియల నిమిత్తం రూ.పదివేలు అందజేశారు. వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 16 వార్డు కౌన్సిలర్ గిన్నారపు రజిత రవి, 14వ వార్డు కౌన్సిలర్ సంధ బిందు ప్రవీణ్, నాలుగో వార్డ్ కౌన్సిలర్ సయ్యద్ ఆజాం, మేనేజర్, అకౌంటెంట్ పాల్గొన్నారు.
జోహార్లు అర్పించిన కార్మికులు
మేజర్ గ్రామ పంచాయతీ నుండి పని చేసిన మున్సిపల్ నామినల్ మాస్టర్ రూల్ కార్మికురాలు మినుముల మరియమ్మ మృతి పట్ల తెలంగాణ ప్రగతి శీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరియమ్మ భౌతిక కాయానికి జిల్లా కార్యదర్శి షేక్ యాకూబ్ షావలి, కార్మికులు దండ వేసి జోహార్లు అర్పించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ మినుముల మరియమ్మ మున్సిపాలిటీల్లో ఐఎఫ్టి యూనియన్ బలోపేతానికి కృషి చేసిందని విధుల పట్ల అంకిత భావంతో పని చేసిందన్నారు. మున్సిపల్ పిఎఫ్ అధికారులు పీఎఫ్ డబ్బులు కార్మికుల అకౌంట్లో జమ చేయాలన్నారు. మరియమ్మ కుటుంబానికి బంధుమిత్రులకు తమ సంతాపాన్ని సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విక్రమ్, మాట్లశీను, సంజీవ్, వెంకటేశ్వర్లు, రాణి, భారతి, భూలక్ష్మి, సంధ్య, ఉమా, ఎల్లబారు తదితరులు పాల్గొన్నారు.