Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
అక్రమంగా తరలిస్తున్న నిషేదిత రూ.44 లక్షల విలువైన గంజాయిని దుమ్ముగూడెం పోలీసులు మంగళవారం స్వాధీనపర్చుకున్నారు. భద్రాచలం ఇన్చార్జీ ఏఎస్పీ రోహిత్‌రాజ్ తెలిపిన వివరాల ప్రకారం...దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ యం.రవికుమార్, సిఆర్పిఎఫ్, పోలీస్ సిబ్బందితో కలసి చిన్ననల్లబల్లి గ్రామం వద్ద సుమారు 2.30 గంటల సమయంలో వాహన తనిఖీలు చేస్తుండగా భద్రాచలం వైపు నుండి వస్తున్న నెంబరు లేని కారు పోలీస్ వారిని చూసి పారిపోవుటకు ప్రయత్నించారు. కాగా పోలీసులు వారిని వెంబడించి పట్టుకుని కారులో తనిఖీలు నిర్వహించగా కారులో నాలుగు పార్శిళ్లు ఉన్నాయి. అట్టి పార్శిల్స్‌ను పరీశీలించగా ప్రభుత్వ నిషేధిగా గంజాయిగా గుర్తించారు. వారి వివరములు తెలుసుకోగా సిధాంత్ దోలే, అమోలే గోర్డెగా తెలిపారు. వీరిది మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌గా తెలిపారు. వీరితో పాటు సందీప్ సాత్లే, కైలాష్ మోగే, దత్త గోర్డెలతో కలసి తాము ఆంద్ర, ఒడిస్సా సరిహద్దు రాష్ట్రాలలోని గ్రామాలలో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద గంజాయి కొనుగోలు చేసి మహారాష్ట్ర తీసుకు వెళుతున్నామని తెలిపారు. వీరి వద్ద పట్టుబడ్డ 220 కేజీల గంజాయి సుమారు రూ.44 లక్షల 08 వేలు ఉంటుందని ఏఎస్పీ తెలిపారు. ఇట్టి కేసులో సందీప్సాత్లే, కైలాష్మోగె, దత్త గోర్డేలు తప్పించుకోగా పట్టుబడ్డపై ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఆయన తెలిపారు. ఏఎస్సీ వెంట వివరాలు వెల్లడించిన వారిలో సిఐ దోమల రమేష్, హెడ్ కానిస్టేబుల్ గాలి సురేష్, రమేష్ తదితరులు ఉన్నారు.