Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దమ్మపేట
దమ్మపేట మండల సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతుసంఘం ఆధ్వర్యంలో మంగళవారం కేంద్ర బడ్జెట్‌కు నిరసనగా దమ్మపేటలో రైతుసంఘం జిల్లా కమిటీ సభ్యులు దొడ్డాలకిëనారాయణ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యకాస జిల్లా కమిటీ సభ్యులు పిల్లి నాయుడు మాట్లాడారు. కేంద్ర బడ్జెట్లో పెట్రోల్, డీజిల్, వంటగ్యాసుపై సబ్సిడీ, సంపన్నులపై పన్నులు పెంచాలన్నారు. జాతీయ ఆస్తులు నగరీకరణ ఆపాలన్నారు. మధ్యాహ్న భోజనం పథకంనకు నిధులు పెంచాలన్నారు. ఉపాధి హామీ పథకంనకు నిధులు పెంచాలన్నారు. వ్యవసాయ కార్మికులను ఆదుకోవాల న్నారు. ఐసీడీయస్ పరిరక్షణ, అంగన్వాడీల భృతి కోసం నిధులు పెంచాలి అని డిమాండ్ చేశారు. ఈ సమావేశలంలో సీఐటీయూ నుండి కొప్పుల శ్రీనివాసరావు, మండల కమిటీ సభ్యులు బోగి నరసింహారావు, రైతు సంఘం నుండి దొడ్డా లకిëనారాయణ, మోరంపూడి శ్రీనివాసరావు, వ్యవసాయ కార్మిక సంఘం నుండి పిల్లి నాయుడు, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.